చంద్రముఖి2 వాయిదా.. జవాన్ కు భయపడ్డారా

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా చంద్రముఖి2. 17యేళ్ల క్రితం వచ్చిన చంద్రముఖికి సీక్వెల్ గా ఆ దర్శకుడు పి వాసునే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయాలనుకున్నారు. విడుదలకు అంతా సిద్ధం అనుకుంటున్న టైమ్ లో సడెన్ గా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు మేకర్స్.

ఏ పోస్ట్ పోన్ కైనా ఒక కారణం ఉంటుంది కదా.. వీళ్లు చెబున్నది ఏంటంటే.. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అని. కానీ నిజం అది కాదు. ప్రస్తుతం జవాన్ ఊపు మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా అన్ని బాక్సాఫీస్ లను షేక్ చేస్తోంది. ఈ ఊపు మరో రెండు వారాల పాటు ఉంటుందని అంచనా వేశారు. అందుకే తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు చంద్రముఖి2 మేకర్స్.


ఇక ఈ పోస్ట్ పోన్ వల్ల పూర్తిగా లాభపడేది ఎవరంటే విశాల్. ఆయన సినిమా మార్క్ ఆంటోనీ కూడా అదే రోజు విడుదల ఉంది. దీంతో చంద్రముఖి2, మార్క్ ఆంటోనీ మధ్య పోటీ ఉంటుందని భావించారు. అంతకు ముందు ఈ రెండు చిత్రాలకు తెలుగులో స్కందో పోటీ అనుకున్నారు. ఆల్రెడీ స్కందను 28కి వాయిదా వేశారు. ఇప్పుడు చంద్రముఖి2 కూడా పోస్ట్ పోన్ అయింది. దీంతో విశాల్ మార్క్ ఆంటోనీకి సోలో రిలీజ్ దక్కింది.


ఇక చంద్రముఖి2ను కూడా సెప్టెంబర్ 28న విడుదల చేస్తారు అనే ప్రచారం మొదలైంది. అదే నిజమైతే ఖచ్చితంగా ఆ డేట్ కిక్కిరిసిపోతుంది. ఇప్పటికే నాలుగు తెలుగు సినిమాలున్నాయి. వీటిలో స్కంద ప్యాన్ ఇండియన్ రిలీజ్. ఇటు చంద్రముఖి2 కూడా ప్యాన్ ఇండియన్ మూవీనే. సో.. 28న వాళ్లూ వస్తే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది.

కాకపోతే పాపం 28న రావాల్సిన సలార్ వాయిదా పడటం కారణంగా వెంటనే మూడు చిన్న సినిమాలు ఆ డేట్ లో రిలీజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇలా ఉంది. మరి చంద్రముఖి2 కొత్త రిలీజ్ డేట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Posts