త్రిష ద రోడ్ మూవీ ట్రైలర్.. సస్పెన్స్ థ్రిల్లర్

మోస్ట్ గార్జియస్ బ్యూటీ త్రిష లేటెస్ట్ మూవీ “ద రోడ్”. రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది క్యాప్షన్. ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసేలా ఉంది. కంప్లీట్ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ త్రిష చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలకు భిన్నంగా ఉందీ ట్రైలర్.

నేషనల్ హైవే 44లో ఒక పర్టిక్యులర్ ప్లేస్ లోనే వరుసగా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అలా ఒకే ప్లేస్ లో ప్రమాదాలు జరగడం అనేది చాలా రేర్. అలా త్రిష తన భర్త పిల్లలతో కలిసి వెళుతున్నప్పుడు కూడా ఈ ప్రమాదం జరుగుతుంది. భర్త చనిపోతాడు. కానీ తనకు తెలిసినంత వరకూ ఇది నార్మల్ యాక్సిడెంట్ కాదు. ఏదో జరిగింది అనిపిస్తుంది. ఆ దిశగా తను చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు తెలుస్తుంటాయి. కానీ వాటికి ఆధారాలు మాయమైపోతుంటాయి. దీంతో పోలీస్ లు కూడా పూర్తిగా సహకరించరు. మరి ఆ ప్లేస్ లో ఏముంది.. ఎందుకు అక్కడే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వెనక ఏదైనా ముఠా, వ్యక్తి ఉన్నారా.. అనే కోణంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా ఉందీ ట్రైలర్.


మామూలుగా రోడ్ యాక్సిడెంట్స్ అనగానే దాని చుట్టూ ఓ కథను అల్లుకోవడం కాస్త సులభమే. కానీ వరుసగా ఒకే ప్రదేశంలో ప్రమాదాలు జరగడం అనేది ఖచ్చితంగా ఆసక్తిని కలిగించేదే. కొన్నాళ్ల క్రితం కన్నడలో వచ్చిన యూటర్న్(తెలుగులో సమంత చేసింది) సినిమా కూడా రోడ్ పై సాగేదే. కానీ దీని వెనక ఓ ఆత్మ ఉంటుంది. బట్ ద రోడ్ లో అలాంటిదేం లేదు. కాకపోతే ట్రైలర్ లో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిని ప్రధానంగా హైలెట్ చేయడం వల్ల అతని కోణంలో ఈ కథ సాగుతుందా అనిపిస్తుంది.


ఇక ట్రైలర్ ఆరంభంలోనే ” పగ తీర్చుకోవడంలో ఆడవాళ్లు మగవాళ్ల కంటే దారుణంగా ప్రవర్తిస్తారు..” అని ఓ ఫ్రెండ్ సేయింగ్ ను చూపించడం ద్వారా ఈ కథలో త్రిష పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా త్రిషకు సోలోగా ఓ బ్లాక్ బస్టర్ పడబోతోందనేలా ఉందీ ట్రైలర్. అఫ్‌ కోర్స్ ఈ తరహా కథల్లో ప్రేక్షకుల అంచనాలను దాటుకుని కథనం ఉండాలి. అప్పుడే విజయం సాధ్యం అవుతుంది. ఇక త్రిషతో పాటు డ్యాన్సింగ్ రోజ్ షబీర్, సంతోష్‌ ప్రతాప్, మియా జార్జ్, ఎమ్ఎస్ భాస్కర్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఏఏఏ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లు నిర్మించారు. అరుణ్ వసీకరణ్ దర్శకుడు.

Related Posts