మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టికి టైమ్ వచ్చింది

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.. స్వీటీ బ్యూటీ అనుష్క, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తోన్న సినిమా. మహేష్ బాబు డైరక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

నిశ్శబ్ధం అనే సినిమా తర్వాత దాదాపుగా సైలెంట్ అయిపోయింది అనుష్క. బాగా ఒళ్లు చేయడం వల్ల కూడా సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఒళ్లు తగ్గించేందుకు దేశ, విదేశాల్లో అనేక రకాల చికిత్సలు తీసుకుంది. కానీ పెద్దగా ఉపయోగం లేదు అని ఇదే చిత్రం నుంచి తన లుక్ చూస్తే అర్థం అవుతుంది.

ఆ మధ్య వచ్చిన ఈ మూవీ టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది. ఇక లేటెస్ట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.


ఆగస్ట్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. దీంతో చాలామంది సమ్మర్ లోనే విడుదల చేస్తారు అనుకున్నారు. సమ్మర్ లో వచ్చిన చిత్రాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. వీళ్లు కానీ వచ్చి ఉంటే కాంబినేషన్ క్రేజ్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. కంటెంట్ బావుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలిచేది అని అప్పట్లోనే చాలామంది అనుకున్నారు.

వీరు మాత్రం సమ్మర్ ను మిస్ చేసుకున్నారు. కూల్ గా మాన్ సూన్ లో మెస్మరైజ్ చేస్తాం అంటూ ఆగస్ట్ 4ను ఎంచుకున్నారు. మరి ఈ డేట్ కరెక్టా కాదా అనేది చెప్పలేం కానీ.. బాగా ఆలస్యం చేసుకున్నారు అనేది మాత్రం నిజం.

మరి అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ల సొంత పేర్లలోని సగం పదాలనే సినిమా టైటిగ్ గా మార్చి వస్తోన్న ఈ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆడియన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి

Related Posts