రికార్డులు బద్దలుకొట్టడానికి వచ్చేస్తున్న ‘టైగర్‘

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘టైగర్ 3‘. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న సల్మాన్ ని.. మళ్లీ ఫుల్ ఫామ్ లో నిలబెట్టే సత్తా ఉన్న చిత్రమిది. అందుకు ప్రధాన కారణం నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్. 50 ఏళ్లుగా బాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతోన్న యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీయే ‘టైగర్ 3‘.

సల్మాన్ ఖాన్, కత్రిన జంటగా నటించిన ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై‘ చిత్రాలకు కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. అయితే కథ ప్రకారం యశ్ రాజ్ మూవీస్ ‘టైగర్ జిందా హై, వార్, పఠాన్‘ లకు కొనసాగింపుగా ఉండబోతుంది. ‘బ్యాండ్ బాజా బారత్, శుధ్ దేశీ రొమాన్స్‘ వంటి విజయాలందించిన మనీష్ శర్మ డైరెక్షన్ లో ‘టైగర్ 3‘ రూపొందుతోంది. లేటెస్ట్ గా ‘టైగర్ 3‘ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘దేశంలో శాంతికి, దేశంలోని శతృవులకు మధ్య ఎంత దూరం ఉంటుంది.. కేవలం ఒక మనిషంత‘ అంటూ రేవతి డైలాగ్స్ తో ట్రైలర్ మొదలైంది. ఇక.. అక్కడ్నుంచి ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్సెస్ తో ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ట్రైలర్ స్టార్టింగ్ లో బిల్డింగ్స్ పై నుంచి బైక్స్ తో వచ్చే స్టంట్స్ అయితే హైలైట్ అని చెప్పాలి. ఇక.. ‘ప్రతి వాడికి లైఫ్ లో అతివిలువైన కానుక అతని ఫ్యామిలీనే అవుతుంది. భార్య ప్రేమ, పిల్లల సంతోషం. నా నుంచి ఇవన్నీ లాగేసుకున్నావు టైగర్‘ అంటూ విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ అదిరింది.

అయితే.. తన కుటుంబమా.. దేశమా.. అనే సందిగ్దంలో పడిపోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు టైగర్ ఏం చేశాడు అనేదే మిగతా కథ. అలాగే.. ‘టపాసులు కాల్చడం నువ్వు మొదలుపెట్టావు.. నేను ముగిస్తాను..‘ అంటూ గన్ పట్టుకుని రణరంగంలోకి దూకిన సల్మాన్ స్టంట్స్ ట్రైలర్ కే హైలైట్. ఇంకా.. సల్మాన్ తో పాటు కత్రిన చేసే హై వోల్టేజ్ యాక్షన్ కూడా ‘టైగర్ 3‘కి మరో ప్లస్ కానుంది.

అవినాష్ సింగ్ రాథోడ్ అలియాస్ టైగర్ గా సల్మాన్ కనిపించబోతున్న ఈ సినిమాలో జోయా పాత్రలో కత్రిన నటించింది. ఇమ్రాన్ హష్మీతో పాటు రేవతి, రిద్ధి డోగ్రా, విశాల్ జెత్వా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో మరో విశేషమేమిటంటే కింగ్ ఖాన్ షారుఖ్ స్పెషల్ అప్పీరెన్స్ లో కనిపించబోతుండడం. మొత్తంమీద.. ట్రైలర్ తో గూస్ బంప్స్ తెప్పించిన ‘టైగర్ 3‘ దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts