తెలుగులో ‘సలార్’ టార్గెట్ 300 కోట్లు

ఈ ఏడాది రాబోతున్న అత్యంత క్రేజీ మూవీస్ లో ‘సలార్’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న చిత్రమిది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ‘సలార్’లోని ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న విడుదలకు ముస్తాబవుతోంది.

వరల్డ్ వైడ్ గా ‘సలార్’ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఓ రేంజులో జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలుపుకుని రూ.175 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం మామూలు విషయం కాదు. అంటే ‘సలార్’ విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.300 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధిస్తేనే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుందన్న మాట.

‘సలార్’ ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. అసలు సెప్టెంబర్ 28నే రావాల్సిన ‘సలార్’ కోసం అక్కడ టిక్కెట్ సేల్స్ కూడా మొదలుపెట్టారు. కానీ తర్వాత ఆపేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసిన ‘సలార్’ నాన్-థియేట్రికల్ గానూ దాదాపు రూ.200 కోట్లు కొల్లగొట్టే అవకావాలున్నాయట. మొత్తంమీద.. వరుస ఫ్లాపులతో ఉన్న ప్రభాస్ కు ‘సలార్’తో ప్రశాంత్ నీల్ భారీ విజయాన్నందిస్తాడేమో చూడాలి.

Related Posts