తెలంగాణ సర్కారు గద్దర్ అవార్డులు

అవార్డులనేవి కళాకారులకు ఎంతో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. తమ శ్రమకు తగ్గ గుర్తింపును అందిస్తాయి. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమలోనే అత్యుత్తమమైనదిగా నంది అవార్డును భావిస్తారు నటీనటులు, సాంకేతిక నిపుణులు. తెలుగు చిత్ర సీమకు సేవలందించిన కళాకారులకు దశాబ్దాలుగా నంది పురస్కారాలు అందించాయి పలు ప్రభుత్వాలు. అయితే.. కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డుల గురించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించకోవడం లేదు.

గతంలో కెసిఆర్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ కళాకారులకు ‘సింహా’ అవార్డులు అందిస్తామని ప్రకటించింది. కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు అందిస్తామని ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓ క‌ళాకారుడి పేరుతో అవార్డులు స్థాపించి, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ఇవ్వాల‌నుకోవ‌డం స్వాగ‌తించాల్సిన ప‌రిణామ‌మే.

Related Posts