స్టార్ బాయ్ దెబ్బకి బాక్సాఫీస్ పగిలిపోయింది

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. విడుదలై మూడు వారాలవుతోన్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద ‘టిల్లు’ సందడి కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్’ వరల్డ్ వైడ్ గా రూ.125 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది. చిన్న సినిమాగా విడుదలై ఈ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ లో ఇది అతిపెద్ద విజయం.

‘టిల్లు స్క్వేర్’కి సమ్మర్ సీజన్ బాగా కలిసొచ్చింది. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక.. ఆ తర్వాతి వారం విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత థియేటర్లలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద ‘టిల్లు’కి తిరుగులేకుండా పోయింది. ఇంకా.. సినిమా హాళ్లలోకి మరో పెద్ద సినిమా రావడానికి చాలా సమయం పడుతోంది. అప్పటివరకూ స్టార్ బాయ్ రికార్డ్స్ ను పగలగొడుతూనే ఉంటాడేమో!.

Related Posts