కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లకే స్టార్ స్టేటస్ దక్కించుకుంది శ్రీలీల. గడిచిన ఏడాదిన్నర కాలంలో తెలుగులో ఏకంగా అరడజను సినిమాలను ఆడియన్స్ ముందు నిలిపిన శ్రీలీల.. ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. ఈ అమ్మడి కిట్టీలో ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటే ఉంది. అయితే.. ఈ సినిమా మళ్లీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని తన చదువు కోసం ఉపయోగించుకున్న శ్రీలీల.. ఇకపై మళ్లీ సినిమాల స్పీడు పెంచబోతుందట. ఈసారి కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందట. అది కూడా అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్ తో. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిల్ హీరోగా నటించే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో శ్రీలీల ఎంట్రీపై అధికారిక ప్రకటన రానుందట.

Related Posts