శర్వా 36 వ సినిమా గ్రాండ్ ఓపెనింగ్

శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా.. మనమే చిత్ర టైటిల్‌ ను అనౌన్స్ చేసారు. అలాగే నెక్ట్స్‌ మూవీని యువి క్రియేషన్స్ నిర్మించబోతుంది. సూపర్‌హిట్ వెబ్‌సిరీస్‌ ‘లూజర్’ డైరెక్షన్ చేసిన అభిలాష్‌కంకరతో శర్వా 36 వ మూవీ అనౌన్స్ అయ్యింది.

వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు..మూడు పెద్ద బ్లాక్‌బస్టర్‌లను అందించిన శర్వానంద్‌కి యూవీ క్రియేషన్స్ లక్కీస్ట్ ప్రొడక్షన్ హౌస్.


, ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా ఉండబోతోంది, ఇందులో హీరో బైక్ రైడర్‌గా కనిపిస్తారు.పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా స్క్రిప్ట్ ను శర్వా దర్శకుడికి అందించగా.. హీరో హీరోయిన్లపై చిత్ర ప్రజెంటర్ విక్రమ్‌ క్లాప్ కొట్టారు.


90,20వ దశకం ప్రారంభంలో మోటోక్రాస్ రేసింగ్ నేపధ్యంతో పాటు లవ్, డ్రీమ్స్ ఈ సినిమాలో మెయిన్‌పాయింట్స్‌ . జిబ్రాన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

Related Posts