HomeMoviesటాలీవుడ్స్టైలిష్‌లుక్‌ లో సమంత బ్యాక్‌ విత్ బ్యాంగ్‌

స్టైలిష్‌లుక్‌ లో సమంత బ్యాక్‌ విత్ బ్యాంగ్‌

-

రీసెంట్‌గా సమంత సెన్సేషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. సినిమాలతోనే కాకుండా వెబ్‌సిరీస్‌లతోనూ బిజీగా ఉన్న సమంత మయోసైటిస్‌ వ్యాధి ఉన్నట్టు ప్రకటించడం , అభిమానులు ఆందోళనపడటం న్యూస్‌లో సెన్సేషన్‌ అయ్యింది.

ఇప్పుడు తన అనారోగ్యం నుంచి కుదురుకుంటూ.. క్రేజీప్రాజెక్ట్‌ సిటాడెల్ ఇండియా వెర్షన్‌ చేస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్‌లో అమెజాన్ ప్రైమ్‌ ఒరిజనల్స్ చేసిన గ్రాండ్ స్లేట్‌ రివీల్ ఈవెంట్‌లో పాల్గొని ఫ్యాన్స్‌ని ఖుషీ చేసింది. సీటాడెల్ టీమ్‌ అంతా వేదికపై కనిపించారు.

సమంత చాలా ఉత్సాహంగా, హుషారుగా ఈ ఈవెంట్ లో పాల్గొని తన పూర్వవైభవాన్ని సంతరించుకున్నట్టు కనిపించింది. మిత్రులు, శ్రేయోభిలాషులతో సరదాగా గడిపింది.

సమంత డ్రస్‌, లుక్‌ చాలా స్టైలిష్ గా ఉండటంతో ఆ వీడియోలు, ఫోటోలు నెట్‌లో వైరల్ అయ్యాయ. ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలను సమంత కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి

English News