పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా రాబోతున్న సాగర్

ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌.. ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సాగర్ హీరోగా నటించిన ‘షాదీ ముబారక్‌’ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు మరోసారి హీరోగా వెండితెరపై మురిపించబోతున్నాడు సాగర్. ‘ది 100‘ అనే వైవిధ్యమైన టైటిల్ తో సాగర్ హీరోగా కొత్త చిత్రం రాబోతుంది.

ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపిఎస్ అధికారి పాత్రలో సాగర్ కనిపించబోతున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ చిత్రాన్ని రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కిస్తున్నారు. ‘యానిమల్, అర్జున్ రెడ్డి‘ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్నందిస్తుండడం విశేషం. అలాగే.. సీనియర్ టెక్నీషియన్ శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘ది 100‘ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుందట.

Related Posts