రజనీకాంత్ కి విలన్ గా మారిన రానా

సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.ఙ్ఞాన్‌వేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘జై భీమ్’ సినిమాతో మంచి సందేశాన్నందించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ రజనీకాంత్ ‘వేట్టయాన్’ని కూడా ఓ మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీగా తీర్చిదిద్దుతున్నాడట. ఇప్పటివరకూ రజనీకాంత్ సినిమాల్లో లేనంతమంది భారీ తారాగణం ఈ చిత్రంలో కనిపించబోతుంది. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మొదలుకొని రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇలా చాలామంది స్టార్సే ఈ మూవీలో నటిస్తున్నారు.

ఇంతమంది నటీనటులు ఒక సినిమాలో కనిపిస్తే.. ఎవరి పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉండబోతుంది? అనే ఊహాగానాలు మొదలవుతాయి. అయితే.. ఈ మూవీలో మిగతా నటీనటుల విషయాన్ని పక్కనపెడితే మన టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా రోల్ మాత్రం సమ్‌థింగ్ స్పెషల్ గా నిలవబోతుందట. ‘వేట్టయాన్’ మూవీలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడట భళ్లాలదేవ రానా.

‘బాహుబలి’ చిత్రంతో ప్రతినాయకుడు అనే పదానికి అసలుసిసలు నిర్వచనంలా కనిపించాడు రానా. మళ్లీ రానా నుంచి అలాంటి ఫుల్ లెన్త్ విలనిజం పండించిన పాత్ర రాలేదు. ఇప్పుడు ‘వేట్టయాన్’తో అది తీరబోతుందట. ఈ మూవీలో స్టైలిష్ గా ఉంటూనే.. ఎంతో తెలివితేటలతో అందరినీ బురిడీ కొట్టించే పాత్రలో రానా కనిపించబోతున్నాడట. సైబర్ క్రైమ్స్ కి కేరాఫ్ గా నిలిచే రోల్ లో రానా నటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద.. ‘వేట్టయాన్’లో రజనీకాంత్ తో ఢీ అంటే ఢీ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడట రానా. మరి.. ఆ పాత్ర ఆన్ స్క్రీన్ పై ఏ రేంజులో పండుతుందో తెలియాలంటే అక్టోబర్ వరకూ ఆగాల్సిందే.

Related Posts