‘పుష్ప 2‘ మాస్ జాతర షురూ.. ఏప్రిల్ 8న టీజర్

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప 1.. ది రైజ్‘ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘పుష్ప 1‘. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా ‘పుష్ప‘ ప్రత్యేకమని చెప్పాలి. ఈనేపథ్యంలోనే సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2 ద రూల్‘ పై భారీ అంచనాలు పెరిగాయి.

ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా ‘పుష్ప 2‘ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక.. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ‘పుష్ప 2‘ ప్రచారంలో స్పీడు పెంచడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఇప్పుడు బన్నీ బర్త్ డే అందుకు వేదిక అయ్యింది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ది మోస్ట్ అవైటింగ్ ‘పుష్ప 2‘ నుంచి టీజర్ రాబోతుంది.

‘పుష్ప 2‘ సినిమాలో జాతర ఎపిసోడ్ గురించి చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకూ సిల్వర్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ విజువల్స్ తో ఆడియన్స్ స్టన్ చేసేలా ఆ ఎపిసోడ్ ను తీర్చిదిద్దాడట క్రియేటివ్ జీనియస్ సుకుమార్. ప్రస్తుతం రాబోయే టీజర్ లో కూడా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన గ్లింప్సెస్ విజువల్ ట్రీట్ అందిస్తాయని లేటెస్ట్ గా రిలీజైన్ అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ పోస్టర్ లో గజ్జె కట్టుకుని నృత్యం చేస్తున్న పుష్ప రాజ్ కాలుని మాత్రమే చూపించారు. మొత్తంమీద.. ఆమధ్య ‘వేర్ ఈజ్ పుష్ప‘ అంటూ ‘పుష్ప 2‘ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసిన టీమ్.. ఇప్పుడు టీజర్ తో పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద ప్రభంజనం సృష్టించబోతుందని అర్థమవుతుంది.

Related Posts