‘నా సామిరంగ‘ ప్రమోషన్స్ షురూ

సంక్రాంతి సినిమాల ప్రచారం జోరందుకుంది. ఈసారి సంక్రాంతికి తెలుగు నుంచి ఆరు సినిమాలు రావాల్సి ఉంది. అయితే.. వీటిలో ‘ఫ్యామిలీ స్టార్‘ పక్కకు వెళ్లడంతో ఐదు చిత్రాలు మిగిలాయి. ఆ ఐదు సినిమాలు ప్రచారంలో స్పీడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల్లో ‘నా సామిరంగ‘ తప్ప మిగతా అన్నింటి నుంచి ఫస్ట్ సింగిల్స్ వచ్చేశాయి. ఇప్పుడు నాగార్జున ‘నా సామిరంగ‘ ఫస్ట్ సింగిల్ కూడా రెడీ అయ్యింది.

నాగార్జునకు గతంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన కీరవాణి సంగీతంలో ‘నా సామిరంగ‘ ఆల్బమ్ రూపొందుతోంది. ఈ మూవీ నుంచి ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే‘ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్టు ఓ పోస్టర్ వదిలింది టీమ్. ఈ పోస్టర్ లో కింగ్ నాగార్జున పంచె కట్టులో రైతులా ట్రాక్టర్ పై కాలు పెట్టిన తీరు అదిరిపోయింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను రామ్ మిరియాల ఆలపించాడు. మరి.. మంచి మాస్ బీట్ తో రాబోతున్న ఈ పాట ఏరీతిన అలరిస్తుందో చూడాలి.

Related Posts