బాక్సాఫీస్ వద్ద నాని, నితిన్ సినిమాల సందడి

వారం వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఇక.. ఈ వారం తెలుగు నుంచి నాలుగు సినిమాలు విడుదలవ్వాల్సి ఉండగా.. రెండు చిత్రాలు మాత్రమే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అవే నాని ‘హాయ్ నాన్న‘.. నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘.


నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ‘హాయ్ నాన్న‘ తెరకెక్కింది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. శ్రుతి హాసన్ స్పెషల్ కేమియోలో మురిపించబోతుంది. మరో కీలక మైన పాత్రలో బేబి కియారా ఖన్నా నటించింది. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతాన్ని సమకూర్చిన ‘హాయ్ నాన్న‘ సాంగ్స్ కి సూపర్ అప్లాజ్ వచ్చింది. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ‘హాయ్ నాన్న‘పై మంచి అంచనాలున్నాయి. రేపు వరల్డ్ వైడ్ గా ‘హాయ్ నాన్న‘ విడుదలకు ముస్తాబైంది.

నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘. రచయిత నుంచి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వక్కంతం వంశీ.. అల్లు అర్జున్ తో తీసిన ‘నాపేరు సూర్య‘కి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతుందట. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దాడట వంశీ. ఈ చిత్రాన్ని నితిన్ ఓన్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. ఈనెల 8న నితిన్ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరి.. ఒక్క రోజు గ్యాప్ లో వస్తోన్న ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాలు సాధిస్తాయో చూడాలి.

Related Posts