ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మీటింగ్.. మధ్యలో రిషబ్ శెట్టి

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31గా ఈ ప్రాజెక్ట్ కి నామకరణం చేశారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అయితే.. ఎన్టీఆర్ 31 ఆర్డర్ లో ఛేంజెజ్ వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రంగా ‘దేవర 1’ చేస్తున్నాడు. ఆ తర్వాత ‘దేవర 2’ ఉంది. మధ్యలో ‘వార్ 2’ కూడా ఉంది. దీంతో ఎన్టీఆర్ 31 కాస్త.. ఎన్టీఆర్ 33 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సినిమాల ఆర్డర్ ను కాసేపు పక్కనపెడితే.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోందా? అనే ఆసక్తితో ఉన్నారు ఫ్యాన్స్. చాన్నాళ్ల తర్వాత లేటెస్ట్ గా ఎన్టీఆర్ బెంగళూరులో సందడి చేశాడు. అది కూడా ప్రశాంత్ నీల్ తో. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అవ్వడానికే ఎన్టీఆర్ సతీసమేతంగా బెంగళూరు వెళ్లాడట. ఈ మీటింగ్ లో ప్రశాంత్ నీల్, ఆయన సతీమణి.. ఎన్టీఆర్ దంపతులకు ఘన స్వాగతం పలికిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు ఈ మీటింగ్ లో నిర్మాతలు మైత్రీ రవి, హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ కూడా ఉన్నారు. వీరిద్దరే కాకుండా ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి కూడా ఎన్టీఆర్ తో రచ్చ రచ్చ చేశాడు.

Related Posts