Rebel star : యుద్ధ వీరుడుగా ప్రభాస్

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్ లైనప్ మామూలుగా ఉండటం లేదు. ఏ ప్రాజెక్ట్ చూసినా బిగ్గెస్ట్ కాన్వాస్ తోనే కనిపిస్తోంది. ఈ మధ్యలో మారుతిని సైతం ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ ను చేయబోతున్నాడు ప్రభాస్. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో రామాయణంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా రూపొందిన ఆదిపురుష్‌ జూన్ 16న విడుదల కాబోతోంది.

ఆ తర్వాత ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ గా చెప్పుకుంటోన్న సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మళయాల స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తుండటం విశేషం. శ్రుతి హాసన్ ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోరూపొందుతోన్న ప్రాజెక్ట్ కే వచ్చే సంక్రాంతికి ఫిక్స్ అయింది. మారుతి సినిమా 2024 సమ్మర్ కు వస్తుంది. విశేషం ఏంటంటే.. వీటిలో ఆదిపురుష్‌ కాకుండా మిగతా చిత్రాల షూటింగ్స్ అన్నీ ఈ యేడాది సెప్టెంబర్ లేదా నవంబర్ వరకూ పూర్తవుతాయి. అంటే ఇయర్ ఎండింగ్ కుప్రభాస్ ఖాళీ అయిపోతాడన్నమాట. అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటున్నాడు.ఆ క్రమంలోనే తన వద్దకు వచ్చిన ఓ ప్రపంచ యుద్ధ కథకు ఓటేశాడు అనే టాక్ వినిపిస్తోంది.


ఇండియా పాకిస్తాన్ బోర్డర్ నేపథ్యంలో అద్బుతమైన ప్రేమకథ చెప్పి సీతారామంతో హృదయాలను కొల్లగొట్టిన దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన వరల్డ్ వార్ కథకు ప్రభాస్ ఫిదా అయ్యాడట. వెంటనే ఈ స్టోరీ చేయడానికి ఓకే చెప్పాడని టాక్. ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సినిమా అంటే ఆ యుద్ధాలేవీ మన దేశానికి పెద్దగా సంబంధం లేనివి. కేవలం బ్రిటీష్‌ వారి కోసమే ఇండియన్స్ ఆ రెండు ప్రపంచ యుద్ధాల్లోపార్టిసిపేట్ చేశారు.

అంటే కావాల్సినన్ని ఎమోషన్స్ ఈ కథ చుట్టూ అల్లుకోవచ్చు. కాకపోతే మళ్లీ ప్రేమకథ అంటే సీతారామంతో పోలికలు వస్తాయి. ఏదేమైనా ఇది సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలోనా ఫస్ట్ వరల్డ్ వార్ నేపథ్యంలోనా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాకపోతే ప్రభాస్ ఈ సారి యుద్ధ రంగంలో వీరుడుగా కనిపించబోతున్నాడనేది దాదాపు ఖాయం అంటున్నారు.

Related Posts