పవన్ సినిమాలో పవర్ ఫుల్ లేడీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కొత్త సినిమా ‘ఓజి’ రోజు రోజుకూ అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే పూర్తయిన రెండు షెడ్యూల్స్ తో ఈ మూవీ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో సత్తా చాటుతుందనే నమ్మకాన్ని పెంచుకుంది.ఆల్రెడీ సాహోతో ప్యాన్ ఇండియన్ స్థాయిలో సత్తా చాటిన సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న పై ఎక్స్ పెక్టేషన్స్ ఎప్పటికప్పుడు హై అవుతున్నాయి.

ఓజి అనే టైటిల్ కు అర్థమే అతని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా ఓ రేంజ్ లో హైప్‌ తెచ్చింది. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. ఇంతకు ముందు బాలు, పంజా సినిమాల్లో కూడా గ్యాంగ్ స్టర్ గా నటించాడు పవన్ కళ్యాణ్‌. కానీ ఆ చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ ప్రాజెక్ట్ లోకి బేస్ వాయిస్ విలన్ అర్జున్ దాస్ చేరాడు. అతను పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నాడని చెప్పారు. ఇక లేటెస్ట్ గా మరో పవర్ ఫుల్ లేడీ కూడా యాడ్ అవుతోంది.


జికే రెడ్డి కోడలు.. హీరో విశాల్ ఒదిన ఒకప్పటి హీరోయిన్ కమ్ విలన్ యాక్ట్రెస్ శ్రేయా రెడ్డిని ఓజిలో ఓ కీలక పాత్రకోసం తీసుకున్నారు. ప్రస్తుతం లేడీ విలన్ అన్నా.. కాస్త పవర్ ఫుల్ లేడీ పాత్ర అన్నా మనకు వరలక్ష్మి శరత్ కుమార్ గుర్తొస్తుంది. ఆ గుర్తును బ్రేక్ చేయడంతో పాటు ఆడియన్స్ కు ఓ కొత్త ఫీల్ వచ్చేలా ఈమె సెలెక్షన్ అదిరిపోయిందనే చెప్పాలి.

2003లోనే రాజా హీరోగా నటించిన అప్పుడప్పుడు అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది శ్రేయా రెడ్డి. బట్ ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో తమిళ్ కు వెళ్లిపోయింది. 2006లో శర్వానంద్ మూవీ అమ్మ చెప్పిందిలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలేవీ చేయలేదు. ఇక విశాల్ హీరోగా నటించిన పొగరు చిత్రంలో తను చేసిన లేడీ విలన్ పాత్ర ఇప్పటికీ చాలామందికి గుర్తుంటుంది. ఆ రేంజ్ లో నటించింది. విశేషం ఏంటంటే.. విశాల్ సొంత అన్న విక్రమ్ కృష్ణనే తను పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన శ్రేయా రెడ్డి ప్రస్తుతం సలార్ లోనూ యాక్ట్ చేస్తోంది. ఇక ఒకేసారి పవన్ కళ్యాణ్ సినిమాతో రీ ఎంట్రీ అంటే తన కెరీర్ కు ఇది ఓ కీలకమైన మలుపు అనే చెప్పాలి. మరి ఈ మూవీలో తను ఎలాంటి పాత్ర చేస్తుందో కానీ ఖచ్చితంగా ఓజికి తన ప్రెజెన్స్ ప్లస్ అవుతుందనే చెప్పాలి.

Related Posts