పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ పోస్ట్‌పోన్

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రాలలో ‘ప్రతినిధి 2’ ఒకటి. ఆరేళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన సినిమా ఇది. ఈ చిత్రంతో పాపులర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ఉండడంతో..

ఈ సినిమా విడుదలకు ఇదే సరైన సమయం. ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించేలా రూపొందిన ఈ మూవీకి మంచి బజ్ కూడా ఏర్పడింది.

ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ‘ప్రతినిధి 2’ వాయిదా పడింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతోనే ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. మరి.. మే 13న ఎన్నికల జరుగుతున్నాయి కాబట్టి.. ఆలోపులోనే ‘ప్రతినిధి 2’ వస్తే బాగుంటుందనేది సినీ విశ్లేషకుల మాట. మొత్తంమీద.. త్వరలోనే ‘ప్రతినిధి 2’ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Related Posts