‘ఓదెల 2’ ఫస్ట్ లుక్.. శివ శక్తి గెటప్ లో తమన్నా

డైరెక్టర్ సంపత్ నంది నిర్మాణంలో మంచి విజయాన్ని సాధించిన ‘ఓదెల రైల్వే స్టేషన్‘ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోంది ‘ఓదెల 2’. ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తుంది. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్’ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ పోషించిన తమన్నా.. ‘ఓదెల 2’లో శివశక్తిగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతుంది. ఇటీవలే వారణాసిలో చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ‘ఓదెల 2’ నుంచి మహాశివరాత్రి కానుకగా ఈ సినిమాలో తమన్నా పోషిస్తున్న శివ శక్తి క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో శివ శక్తిగా తమన్నా లుక్ పవర్ ఫుల్ గా ఉంది. సంపత్ నంది నిర్మాతగానూ, క్రియేటర్ గానూ వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్, నీతా లుల్లా కాస్ట్యూమ్స్ టెక్నికల్ గా ‘ఓదెల 2‘కి మరింత అడ్వాంటేజ్ కాబోతున్నాయి.

Related Posts