చరణ్ కి ఎన్టీఆర్, బన్నీ స్పెషల్ బర్త్ డే విషెస్

ఈరోజు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా గ్లోబల్ స్టార్ కి బర్త్ డే విషెస్ వెల్లువ పోటెత్తింది. ఫ్యాన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకూ చరణ్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక.. సెలబ్రిటీస్ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రామ్ చరణ్ కి తెలిపిన బర్త్ డే విషెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి.

సినీ ఇండస్ట్రీలో రైవల్రీ ఫ్యామిలీస్ కు సంబంధించిన హీరోలుగా ప్రచారంలో ఉన్నా.. ‘ఆర్.ఆర్.ఆర్‘ సినిమాతో ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు ఎన్టీఆర్, చరణ్. క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్‘తో వీరిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో అందరితోనూ ‘నాటు నాటు‘ స్టెప్పులేయించారు. ఈరోజు చరణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చెర్రీకి బర్త్ డే విషెస్ తెలిపాడు తారక్. ‘హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ రామ్ చరణ్. సంవత్సరం అంతా సంతోషంగా, ఆనందంగా, సక్సెస్ లతో గడపాలని కోరుకుంటున్నట్టు‘ తెలిపాడు.

మరోవైపు చరణ్ కి బావ అయిన బన్నీ కూడా గ్లోబల్ స్టార్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ అందించాడు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ‘హ్యాపీ బర్త్ డే టు మై మోస్ట్ స్పెషల్ కజిన్.. లవ్ యూ ఆల్వేస్‘ అంటూ ఓ కాండిడ్ వీడియోని షేర్ చేశాడు.

Related Posts