‘ముత్తు’ సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్‌లో నిలిచిన సూపర్ హిట్ చిత్రాలలో ‘ముత్తు’ ఒకటి. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 1995లో విడుదలై భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఇందులో రజనీకాంత్ సరసన మీనా హీరోయిన్‌గా నటించింది. ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్. రెహమాన్ సంగీతమందించారు.

అయితే, తాజాగా ‘ముత్తు’ సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇటీవల మొదలైన 4ఖ్ రీ రిలీజ్‌ల ట్రెండ్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టి ప్రేక్షకాదరణ పొందిన కొన్ని చిత్రాలను హీరోల పుట్టిన రోజులకు, సినిమా యానివర్సరీలకు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ మళ్లీ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ముత్తు’ డిసెంబర్ 2న తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక నాలుగు ప్రాంతాల్లోని వేలాది థియేటర్లలో రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన ముత్తు సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

Related Posts