లక్నోలో ‘మిస్టర్‌ బచ్చన్’ భారీ యాక్షన్‌ షూట్

మాస్‌ మహరాజా రవితేజ , హరీష్‌ శంకర్‌లది క్రేజీ కాంబినేషన్‌. ఊరమాస్ ను కూడా స్టైలిష్‌గా ప్రజెంట్ చేయగల హరీష్‌ శంకర్‌ ఈసారి మిరపకాయ్ కన్నా బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానంటూ రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ అనౌన్స్ చేసాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిబొట్ల సహనిర్మాత. భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్ చేస్తోంది. ఈ సినిమా షెడ్యూల్ లక్నోలో ప్రారంభమైంది. ఈ సినిమాకే హైలెట్ అయ్యే యాక్షన్‌ ఎపిసోడ్ ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నారట.


‘నామ్ తో సునా హోగా’ ట్యాగ్‌లైన్ తోరూపొందుతున్న ‘మిస్టర్ బచ్చన్’ లో రవితేజను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడట హరీష్ శంకర్. మిక్కీ జే మేయర్ మ్యూజిక్‌, అయనంక బోస్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా మెయిన్‌ ఎట్రాక్షన్స్ కాబోతున్నాయంటున్నాయి యూనిట్ వర్గాలు.

Related Posts