క్రేజీ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి

సినీ ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కథానాయికలు ఒక్కసారిగా డల్ అవ్వొచ్చు. ఏమాత్రం అంచనాలు లేని సినిమాలతో ప్రవేశించినా అనతి కాలంలోనే అగ్రపథానికి దూసుకెళ్లే నాయికలు కొంతమంది ఉంటారు. ఆ రెండో కోవకు చెందిన బ్యూటీయే మీనాక్షి చౌదరి.

మిస్ ఇండియా నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి కి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు‘ తొలి తెలుగు సినిమా. సుశాంత్ హీరోగా నటించిన ఈ మూవీ ఈ హర్యానా బ్యూటీకి ఆశించిన స్థాయి గుర్తింపును అందించలేకపోయింది. ఆ తర్వాత రవితేజ ‘ఖిలాడి‘లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మీనాక్షి కి.. అడవి శేష్ ‘హిట్:ది సెకండ్ కేస్‘ మంచి హిట్ ఇచ్చింది.

ప్రస్తుతం మీనాక్షి సినిమాల స్పీడు మామూలుగా లేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం‘లో ఒక నాయికగా నటిస్తోన్న మీనాక్షి.. మరోవైపు దుల్కర్ ‘లక్కీ భాస్కర్‘, వరుణ్ తేజ్ ‘మట్కా‘, విశ్వక్ సేన్ సినిమాలలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు లేటెస్ట్ గా తమిళ దళపతి విజయ్ సరసన నటించే క్రేజీ ఆఫర్ అందుకుందట. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించే సినిమాలో ఇప్పటికే ఒక నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు పరిశీలనలో ఉంది. మరో నాయికగా మీనాక్షిని ఫైనలైజ్ చేశారట.

Related Posts