రవితేజ గొంతులో మహావీరుడు జయం

స్మాల్ హీరోలకు స్టార్ హీరోలు సపోర్ట్ చేస్తుండటం చూస్తూనే ఉంటాం. అంటే వాయిస్ ఓవర్స్ ఇవ్వడమో.. లేక పాటలు పాడటమో.. కుదిరితే ఓ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడమో చేస్తుంటారు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు స్మాల్ హీరోలే కాదు.. స్టార్ హీరోలు కూడా ఇలాంటి హెల్ప్ లు తీసుకుంటూ ఉంటారు.

ఈ నెల 14న తెలుగులో మహా వీరుడుగా వస్తున్నాడు తమిళ్ హీరో శివకార్తికేయన్. ఇతనికి ఇక్కడ మార్కెట్ లేదు. కానీ రెమో, డాక్టర్ వరుణ్‌ వంటి సినిమాలతో మనవాళ్లను కూడా మెప్పించాడు. అయితే చాలాకాలంగానే తెలుగు మార్కెట్ కోసం ప్రయత్నిస్తోన్న శివకార్తికేయన్ ఈ సారి కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.

అయినా ఈ సినిమాకు పెద్దగా బజ్ రావడం లేదు అనేది నిజం. అందుకే ఏకంగా మాస్ మహరాజ్ రవితేజతో తన సినిమాకు ఇన్ డైరెక్ట్ గా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. అఫ్‌ కోర్స్ ఇదే పనిని తమిళ్ లో కూడా అక్కడి స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతితో చేయిస్తున్నాడనుకోండి.


మహా వీరుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆ హీరో ఎందుకు పైకి చూస్తున్నాడు అనే అనుమానం వస్తుంది. ఆ పైన ఎవరున్నారు.. అనే డౌట్ కూడా కలుగుతుంది. ఇదే విషయం ట్రైలర్ లోనే విలన్స్ కూడా అతన్ని అడుగుతారు.

” ఎవడిదిగా ఆ గొంతు.. పేరేంటీ” అని విలన్స్ అడుగుతారు.. వెంటనే మాస్ మహరాజా గొంతు నుంచి ధైర్యమే జయం అనే డైలాగ్ వినిపిస్తుంది. అంటే అతనికి పై నుంచి సూచనలు ఇచ్చే గొంతు తెలుగులో రవితేజది, తమిళ్ లో విజయ్ సేతుపతిది అన్నమాట. మరి ఈ వాయిస్ ఓవర్ ఇంకాస్త ఉంటుందా లేక ఆ ఒక్క ముక్కే ఉంటుందా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. బట్ మాస్ రాజా వాయిస్ అంటే శివకార్తికేయన్ కు కొంత ప్లస్ అవుతుందనే చెప్పాలి.

Related Posts