మూడు భాగాలుగా మహాభారతం

మహాభారతం ఆధారంగా వెండితెరపై ఎన్నో సినిమాలొచ్చాయి. బుల్లితెరపై సీరియల్స్ వచ్చాయి. అయినా ఎన్నిసార్లు చూసినా తనివితీరని పురాణ గాథ మహాభారతం. అందుకే నేటి టెక్నాలజీతో మహాభారతాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు ఎంతోమంది దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని.. పది భాగాలుగా ఈ మహా కావ్యాన్ని తెరకెక్కిస్తానంటూ ప్రకటించాడు.

మహాభారతం కథాంశంతో సినిమాలు రూపొందిస్తామంటూ చాలామంది ముందుకొస్తున్నా అవన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఈకోవలోనే తాజాగా సంచలన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘మహాభారతం‘ను మూడు భాగాలుగా తెరకెక్కిస్తానని అనౌన్స్ చేశాడు. ‘కశ్మీర్ ఫైల్స్‘ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాకి రచన, దర్శకత్వం వహించనున్నాడు. ఆయన భార్య పల్లవి జోషి నిర్మాతగా వ్యవహరించబోతుంది. ప్రముఖ రచయిత ఎస్.ఎల్. భైరప్ప రాసిన ‘పర్వ‘ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దీంతో ఈ చిత్రానికి కూడా ‘పర్వ‘ అనే టైటిల్ నే ఖరారు చేశారు.

Related Posts