‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్.. సరికొత్తగా దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్.. టాలీవుడ్ కి చాలా లక్కీ స్టార్. ‘మహానటి, సీతారామం’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్స్ అందుకున్న ఈ మాలీవుడ్ స్టార్.. ఈసారి తెలుగులో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ‘లక్కీ భాస్కర్’గా రాబోతున్నాడు. ‘సార్’తో సెన్సేషనల్ హిట్ అందుకున్న క్రేజీ కాంబినేషన్ వెంకీ అట్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో రూపొందుతోన్న సినిమా ఇది. లేటెస్ట్ గా ‘లక్కీ భాస్కర్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడైన దుల్కర్ సల్మాన్ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే ‘లక్కీ భాస్కర్’ నుంచి ఫస్ట్ లుక్ లాంఛ్ అయ్యింది. 80ల కాలం నాటి బొంబాయి బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ బ్యాంక్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నాడు దుల్కర్. ఈ మూవీలో దుల్కర్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ తో పాటు.. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విడుదల తేదీపై త్వరలో క్లారిటీ రానుంది.

Related Posts