కార్తికేయ కొత్త చిత్రం ‘భజే వాయు వేగం‘.. !

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘భజే వాయు వేగం‘ అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. యు.వి.క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. కార్తికేయ కి జోడీగా ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్ కనిపించనున్నారు.

ఈ చిత్రానికి రదన్ మ్యూజిక్ డైరెక్టర్. ‘భజే వాయు వేగం..‘ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ‘భజే వాయు వేగం‘ రూపొందుతున్నట్టు ఈ మోషన్ పోస్టర్ ను బట్టి తెలుస్తోంది.

Related Posts