‘లవ్ మీ‘ నుంచి ఆకట్టుకుంటున్న ‘ఆటగదరా శివ‘ గీతం

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎక్కువగా అందించే దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న ఘోస్ట్ లవ్ స్టోరీ ‘లవ్ మీ‘. ఈ మూవీకి ‘ఇఫ్ యూ డేర్‘ అనేది ట్యాగ్ లైన్. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాకి అరుణ్ భీమవరపు దర్శకుడు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలతో ‘లవ్ మీ‘పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇక.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ఆటగదరా శివ‘ అంటూ సాగే గీతం విడుదలైంది. ‘ఆటకదరా శివ నీ మాయ.. భ్రాంతి కదరా శివ మాయ.. జన్మనీ.. మరణంనీ.. జంటగా మలిచావే.. ఏదో వెతుకులాట ఇది..‘ అంటూ ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన ఈ పాటను మనీషా ఈరాబత్తిని ఆలపించారు. ఇక.. మరో ఆస్కార్ విజేత కీరవాణి స్వరకల్పనలో రూపొందిన ఈ గీతం మెస్మరైజింగ్ గా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 25న ‘లవ్ మీ‘ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.

Related Posts