ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి కళ్యాణ్‌ రామ్

ప్రస్తుతం అన్ని సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్ లోనూ ప్యాన్ ఇండియన్ ఫీవర్ నడుస్తోంది. ప్రతి హీరో అన్ని భాషల ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది మంచిదే. కానీ కంటెంట్ లేకుండా కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ప్యాన్ ఇండియన్ లెవల్ ఆడియన్స్ ను అలరించాలంటే ఎంచుకున్న కథ యూనిక్ గా ఉండాలి. బలవంతంగా వారికి చూపిస్తున్నట్టు కాక.. వారికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.

అందుకే బాహుబలి, కేజీఎఫ్‌, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాలతో పాటు కాంతార, కార్తికేయ2 వంటి సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ మార్కెట్ లోకి కళ్యాణ్‌ రామ్ కూడా ఎంటర్ అవుతున్నాడు. అయితే కళ్యాణ్‌ రామ్ కథ చూస్తే ఖచ్చితంగా ఇది ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే అతను ఎంటర్ అవుతున్నది డెవిల్ మూవీతో.


రీసెంట్ గా డెవిల్ మూవీ టీజర్ వచ్చింది. ఈ టీజర్ చూసిన ఎవరికైనా ఇది కేవలం ఒక భాషతో ఆగిపోయే కథ కాదు అనిపిస్తుంది. అందుకే డెవిల్ మూవీని హిందీలో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు తాజాగా హిందీ వెర్షన్ టీజర్ విడుదల చేశారు. కళ్యాణ్‌ రామ్ కు ఇప్పటి వరకూ బాలీవుడ్ లో డబ్బింగ్ రూపంలో కూడా పెద్దగా మార్కెట్ లేదు. అందుకే టాప్ స్పీడ్ లో రీచ్ లేదు. కానీ చూసిన వాళ్లంతా సూపర్ అంటున్నారు. మరి హిందీతో ఆపేస్తారా లేక తమిళ్, కన్నడ, మళయాలంలో కూడా విడుదల చేస్తారా అనేది చూడాలి. ఏమాటకు ఆ మాటే.. ఈ మూవీ ఖచ్చితంగా ప్యాన్ ఇండియన్ లుక్ లోనే ఉంది. పైగా ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో జరిగిన కథ కాబట్టి దేశవ్యాప్తంగా ఈజీగా కనెక్ట్ అవుతుంది.

Related Posts