కల్కి’ బిజినెస్ లెక్కలు మామూలుగా లేవు..!

స్టార్ పవర్ ఉంటే చాలు కంటెంట్ తో పనిలేకుండానే కలెక్షన్లు కురిపించొచ్చు. అందుకే.. అగ్ర తారలు నటించే సినిమాలకు బిజినెస్ లెక్కలు మామూలుగా ఉండవు. ఇక.. స్టార్ పవర్ తో పాటు.. కంటెంట్ కూడా కలిసి ఉంటే ఆ సినిమాకి జరిగే బిజినెస్ ఓ రేంజులో ఉంటుంది. ప్రస్తుతం ‘కల్కి’ విషయంలో ఇదే జరుగుతుందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

మే లేదా జూన్ లో ఆడియన్స్ ముందుకొచ్చే ‘కల్కి’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించిన కొన్ని లెక్కలు బయటకు వచ్చాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.190 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనే కాలిక్యులేషన్స్ నెట్టింట జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆంధ్రాలో రేషియో బేసిస్ పై ‘కల్కి’ రూ.90 కోట్లకు పలుకుతుందంటున్నారు. ఇక.. నైజాంలో రూ.70 నుంచి రూ.75 కోట్లు.. సీడెడ్ లో రూ.30 కోట్లుగా ‘కల్కి’ బిజినెస్ లెక్కలున్నాయి. మొత్తంగా.. ప్రభాస్ అంటేనే ఎంతో క్రేజ్.. దానికి తోడు ‘సలార్’ వంటి సెన్సేషనల్ హిట్ ఉండడంతో ఇప్పుడు ‘కల్కి’ ప్రీ రిలీజ్ బిజినెస్ కి రెక్కలు వచ్చాయంటున్నారు. మొత్తంమీద.. త్వరలోనే ‘కల్కి’ ఫైనల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్స్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Related Posts