బిగ్ బాస్ లోకి షకీలా

ఒకప్పటి శృంగార తార, నేటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ షకీలా బిగ్ బాస్ హౌస్ లోకిఎంటర్ కావడం దాదాపు ఖాయమైంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లోకి షకీలా ఎంట్రీ ఇస్తున్నట్టు చెబుతున్నారు. మళయాలంలో బి గ్రేడ్ మూవీస్ తో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది షకీలా.

ఆ టైమ్ లో ఆమె సినిమా విడుదలవుతుందంటే.. మోహన్ లాల్, మమ్మూట్టి వంటి వారే తమ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో ఆ హీరోలు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఆమె సినిమాలనే బ్యాన్ చేయించారు. అప్పట్లో తన రేంజ్ అది. అటుపై కొన్నాళ్లు తమిళ్ లో ఆ తరహా సినిమాలు చేసినా ఫైనల్ గా తేజ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చాడు. ఈ ఇన్నింగ్స్ లో ఆ ఇమేజ్ తో ఎలివేట్ అయింది. కాకపోతే బి గ్రేడ్ మూవీస్ కాదు.

ఓ రకంగా ఈ ఇన్నింగ్స్ లో మంచి విజయమే సాధించింది. చాలామంది పాత్రలు ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడులున్నట్టుగా అప్పుడప్పుడూ కొన్ని ఇంటర్వ్యూస్ లో చెబుతూ వస్తోంది. ప్రస్తుతం చెన్నైలోనే సెటిల్ అయిన షకీలాను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలన్న ఐడియా ఎవరిదో కానీ ఖచ్చితంగా తను హౌస్ లో ప్లస్ అవుతుంది. రేటింగ్స్ కూడా యాడ్ అవుతాయని చెప్పాలి.


విశేషంఏంటంటే.. బిగ్ బాస్ లోకి వెళ్లడం తనకు ఇదే ఫస్ట్ టైమ్ కాదు. 2014లోనే కన్నడ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది. నెల రోజుల తర్వాత ఎలిమినేట్ అయింది. మరి ఇప్పుడు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో కానీ.. షకీలా ఖచ్చితంగా అదనపు ఆకర్షణ అవుతుందనే చెప్పాలి.


ఇక ఈ సారి షో సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కాబోతోంది. మరోసారి నాగార్జునే హోస్టింగ్ చేస్తున్నాడు. గత మూడు సీజన్స్ ఒకటి ఒకటిగా డౌన్ అవుతూ వచ్చాయి. రేటింగ్స్ పరంగానూ మినిమం బజ్ క్రియేట్ కాలేదు. అందుకే ఈ సారి మరింత కఠినంగానూ,ఎంటర్టైనింగ్ గానూ ఉంటుందని.. రకరకాల ప్లానింగ్స్ ఉంటాయని చెబుతూ విడుదల చేసిన ప్రోమోలు ఆకట్టుకున్నాయి. మరి ఆ స్థాయిలో ఈ రియాలిటీ షో ఉంటుందా లేదా అనేది చూడాలి.

Related Posts