జైలర్.. అప్పుడే హాఫ్‌ మిలియన్ కొట్టేశాడు

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు బజ్ తో పనిలేకుండా ఓపెనింగ్స్ ఉంటాయి. మరి బజ్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. మరోసారి జైలర్ కూడా ప్రూవ్ చేయబోతోందనేలా ఈ మూవీ ప్రీమియర్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి.

ఓవర్శీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షో కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన గంటల్లోనే 400 డాలర్స్ దాటిపోయింది. ఈ ఫిగర్ ఈజీగా ఒన్ మిలియన్ వరకూ వెళుతుందనే అంచనాలున్నాయి. అంటే ప్రీమియర్స్ తోనే ఒన్ మిలియన్ అంటే సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే రజినీకాంత్ ఓవర్శీస్ మార్కెట్ ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది కదూ..


నిజానికి ఈ మూవీకి కావాలయ్యా అనే పాట కొంత ఊపు తెచ్చింది. ఆ ఊపును మరో స్థాయికి తీసుకువెళ్లింది ట్రైలర్. సూపర్ స్టార్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ప్రెజెంట్ చేశాడు దర్శకుడు నెల్సన్. ఇదే ప్లస్ అయింది. క్లాస్ మాస్ మిక్స్ అయిన ట్రైలర్ తో రజినీకాంత్ ఆరా యాడ్ అయ్యి చూసిన ప్రతి ఒక్కరూ స్పెల్ బౌండ్ అయ్యారు. సాధారణ కథలనే తన స్టైలింగ్ తో నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళతాడు రజినీకాంత్.

అలాంటిది తన బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ కు సరిపోయే కథైతే ఉంటాడా.. అదే కనిపించిందీ ట్రైలర్ లో. అందుకే ఈ చిత్రానికి అంత హైప్ వచ్చింది. ఆ హైప్ నిజమే అని ప్రీమియర్స్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే ప్రీమియర్స్ కు తెలుగులో అవకాశాలు లేకపోతే తెలుగువాళ్లు కూడా తమిళ్ లో చూసేందుకు ఎగబడుతున్నారట. అదీ రజినీకాంత్.


ఇక 23మూడేళ్ల తర్వాత ఈ సినిమాలో రజినీకి జోడీగా రమ్యకృష్ణ నటించింది. తమన్నా, సునిల్, జాకీ ష్రాఫ్‌, వినాయకన్ వంటి టాలెంటెడ్ ప్యాక్ కూడా ఉంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా జైలర్ తెలుగులో కూడా అదరగొడతాడు.

Related Posts