అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదేనా.. ?

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. పుష్పతో అతను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ మూవీలో కంప్లీట్ డీ గ్లామర్ గా, ఫస్ట్ టైమ్ కొత్త యాక్సెంట్ తో మాట్లాడుతూ.. డిఫరెంట్ మ్యానరిజం, స్టైల్, చూపించి ఆడియన్స్ నుంచి అద్భుతమైన అప్లాజ్ అందుకున్నాడు.

దీనికి ముందే అల వైకుంఠపురములో పాటలతో వాల్డ్ వైడ్ గా ఫేమ్ అయిన ఐకన్ స్టార్ ఇప్పుడు పుష్ప 2 ద రైజ్ తో బిజీగా ఉన్నాడు. ఈ టైమ్ లో సడెన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అనౌన్స్ అయింది. నిజానికి ఇది అనౌన్స్ అయ్యే టైమ్ కూడా ఇదే. కాకపోతే మహేష్‌ తో గుంటూరు కారం చేస్తున్న త్రివిక్రమ్ మధ్యలో కొంత ఆలోచించాడు. కొన్నాళ్ల తర్వాత అనౌన్స్ చేయాలనుకున్నారు. బట్ ఓ పని అయిపోతుంది కదా అని చెప్పేశారు.

ఇక ఈ ప్రకటనలో ఇప్పటి వరకూ వచ్చిన వాటికంటే బిగ్గర్ అని చెబుతూ ఓ గ్లింప్స్ లాంటి వీడియో విడుదల చేశారు. అది చూశాక ఇది అల్లు అర్జున్ తో పాటు త్రివిక్రమ్ కూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అర్థం అవుతోందంటున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు.


ఇప్పటి వరకూ చాలా రకాల జానర్స్ లో సినిమాలు చూశాం. అయితే త్రివిక్రమ్ ఈ సారి ఫస్ట్ టైమ్ ఓ కొత్త కథను ట్రై చేస్తున్నాడు. అఫ్‌ కోర్స్ దీన్ని జానర్ అనలేం. అలాగని ఈ తరహాలో ఇప్పటి వరకూ సినిమాలే రాలేదా అంటే వచ్చాయి.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కు మాత్రం ఫస్ట్ టైమ్. ఇంతకీ కథేంటీ అంటే.. మహా భారతంలోని ఓ పవర్ ఫుల్ పర్వం ను తీసుకుని దాన్ని సోషలైజ్ చేస్తూ ఈ కాలానికి అన్వయించి త్రివిక్రమ్ రాసిన కథ. చాలామందికి తెలుసు. త్రివిక్రమ్ కు మన తెలుగు పురాణాల మీద ఎంత పట్టు ఉందనేది అందరికీ తెలుసు. అలాంటి తను మహా భారతం నుంచి ఓ కథను తీసుకుని దాన్ని ఈ కాలానికి అన్వయించి రాశాడు అంటే ఖచ్చితంగా అందరికీ నచ్చేలానే ఉంటుందని చెప్పొచ్చు.

Related Posts