స్కంద మళ్లీ పోస్ట్ పోన్ అవుతోందా

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొంది సినిమా స్కంద. శ్రీ లీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ సడెన్ గా 28కి పోస్ట్ పోన్ చేశారు. బట్ 15 డేట్ రైట్ టైమ్ అనేది చాలామంది భావన. అయినా అఫీషియల్ గానే పోస్ట్ పోన్ చేశారు కాబట్టి కామ్ గా ఉన్నారు.

ఈ మూవీపై భారీ అంచనాలు లేవు కానీ.. అంతకు మించిన భారీ బిజినెస్ అయింది. నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే టేబిల్ ప్రాఫిట్ అనిపించుకుంది. థియేట్రికల్ రైట్స్ గా 60 కోట్లు టార్గెట్ తో విడుదల కాబోతోంది. నాన్ థియేట్రికల్ గా ఏకంగా 98 కోట్లకు డీల్ సెట్ అయింది. అఫ్ కోర్స్ ఇది అన్ని భాషలకూ కలిపి.


ఇక ఈ మూవీకి సంబంధించి ప్రమోషనల్ గా ఎలాంటి సందడి కనిపించడం లేదు. దీంతో మరోసారి వాయిదా పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది కదా అప్పుడే ప్రమోషన్స్ ఎందుకు అనుకోవచ్చు.

బట్ 28న స్కందకు పోటీ కూడా గట్టిగానే ఉంది. ముఖ్యంగా చంద్రముఖి2 అదే రోజు విడుదలవుతుంది. మ్యాడ్ అనే చిన్న సినిమాతో పాటు లేటెస్ట్ గా వచ్చిన టీజర్ సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పెదకాపు1 ఆ తర్వాతి రోజు విడుదల కాబోతోంది. ఇవాళా రేపు స్టార్డమ్ కంటే కంటెంట్ నే చూస్తున్నారు జనం. ఆ కంటెంట్ కు సంబంధించిన టాక్ వచ్చిన తర్వాతే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. కనీసం ఆ టాక్ అయినా బలంగా రావాలంటే ఓపెనింగ్స్ గట్టిగా ఉండాలి. అంటే ప్రమోషన్స్ తో అట్రాక్ట్ చేయాలి. ఈ విషయంలోనే కాస్త వీక్ గా ఉంది స్కంద అనుకుంటున్నారు.


దీంతో పాటు మరోసారి వాయిదా పడబోతోందా అనే రూమర్స్ కూడా మొదలయ్యాయి. లేదంటే భారీ టార్గెట్ తో విడుదల కాబోతోన్న మూవీ ఇంత సైలెంట్ గా ఎందుకు ఉంటుందనే లాజిక్స్ తీస్తున్నారు. బట్ మళ్లీ వాయిదా పడే అవకాశం లేదు కానీ.. ప్రమోషన్స్ పెంచకపోతే జనం అదే నిజం అనుకునే ప్రమాదం మాత్రం ఉంది.

Related Posts