హను మాన్ .. ఇంక మొదలుపెడుతున్నారా

టాలీవుడ్ యంగ్ జెనరేషన్ లో టాలెంటెడ్ అనిపించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మూవీ ఎవరికీ అర్థం కాకపోయినా ఏదో కొత్తగా ప్రయత్నించాడు అనిపించుకున్నాడు. నెక్ట్స్ కల్కితో తనలోని మేకింగ్ టాలెంట్ ను చూపించాడు. ఆ సినిమా కమర్షియల్ గా క్లిక్ కాకపోయినా ప్రశాంత్ వర్మ టేకింగ్ కు టాలీవుడ్ టేకే బో అనేసింది.

ఆ తర్వాత మళ్లీ కొత్తగా ప్రయత్నిస్తూ చేసిన జాంబిరెడ్డి కమర్షియల్ గానూ సూపర్ హిట్ అయింది. ఈ తరహా ప్రయత్నాలు తెలుగులో అంతకు ముందు లేకపోవడం విశేషం. జాంబిరెడ్డి హీరో తేజా సజ్జా తోనే తర్వాత హనుమాన్ అనే సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఆగుతున్నారు.

కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ ఆదిపురుష్ కంటే గ్రాఫికల్ గా అనేక రెట్లు బెటర్ అనిపించుకుంది. మినిమం బడ్జెట్ తోనే మాగ్జిమం ఇంపాక్ట్ ఈ టీజర్ తోనే చూపించాడు. నిజానికి టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే అప్పటి నుంచి రిలీజ్ ఎప్పుడు అని అంతా అడగడం మొదలుపెట్టారు.


హనుమాన్ ను వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేస్తాం అని ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఇక టీజర్ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి సందడీ కనిపించలేదు. ఈ విషయంలో కొంత నిరుత్సాహం కనిపించింది. బట్ ఫైనల్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త అప్డేట్ ఇచ్చాడు.

హను మాన్ ప్రమోషన్స్ ను ఈ వినాయక చవితి నుంచి ప్రారంభిస్తున్నాం అని ఎక్స్(ట్వీట్) చేశాడు. అంటే ఆ రోజు ఏదైనా పాట లేదా సినిమాలో వినాయకుడి గురించిన థీమ్ వీడియో ను విడుదల చేస్తారేమో కానీ.. వినాయక చవితి నుంచి హనుమాన్ సందడి మొదలు కాబోతోందన్నమాట.

Related Posts