టాలీవుడ్ ఈ డేట్ ను ఎందుకు వదిలేసింది..

ఒక సినిమా పోస్ట్ పోన్ కాగానే పోలోమని అంతా ఆ డేట్ పైనే పడ్డారు. అది సెప్టెంబర్ 28. సలార్ వాయిదా పడగానే చిన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ వేసుకున్నాయి. వాటికి పోటీగా స్కంద, చంద్రముఖి2 వీళ్ల డేట్స్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి మరీ 28కి వెళ్లాయి.

ఈ రెండు పోస్ట్ పోన్ కాగానే సడెన్ గా మరో మూడు చిన్న సినిమాలు సెప్టెంబర్ 15న డేట్స్ అనౌన్స్ చేసుకుని హడావిడీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా చేసుకుని ఇంటర్వ్యూస్ తో ప్రమోషన్స్ పెంచుతూ విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే ఈ రెండు డేట్స్ మధ్య ఉన్న సెప్టెంబర్ 22ను మాత్రం అంతా వదిలేయడం విశేషం.


నిజానికి సెప్టెంబర్ 22న సినిమాలేవీ లేవు. ఇప్పటి వరకూ 7/జి బృందావన కాలనీ సినిమాను రీ రిలీజ్ చేస్తాం అన్నారు. కానీ ఆ ఊసులేవీ వినిపించడం లేదు. తాజాగా అష్టదిగ్బంధనం అనే సినిమా 22న విడుదల అని కొత్త పోస్టర్ వేసుకుంది.

ఈ డేట్ కు ముందు వినాయక చవితి ఉత్సవాలు మొదలవుతాయి. అంటే ఎలా చూసినా కేవలం పండగ అన్న కారణమే కానీ.. నిజానికి చవితి టైమ్ లో యూత్ అంతా మండపాలకే ప్రాధాన్యం ఇస్తారు. అలా చూస్తే సెప్టెంబర్ 15 కంటే 22 చాలా బెటర్.బట్ మనవాళ్లు అవసరమైతే అక్టోబర్ 6కు వెళుతున్నారు కానీ..ఈ 22ను మాత్రం పట్టించుకోవడం లేదు. చూస్తుంటే ఇక కొన్ని చిన్న సినిమాలన్నీ ఈ డేట్ ను ఆక్యూపై చేసేలా ఉన్నాయి. ఏదేమైనా ఒక వారాన్ని పూర్తిగా వదిలిపెట్టి.. ముందూ, వెనక వీక్స్ వెనక పరుగులుపెట్టడం కొంత ఆశ్చర్యంగానే ఉంది.

Related Posts