బిగ్ బాస్ ఒక వర్గానికే కొమ్ము కాస్తోందా?


‘బిగ్ బాస్’ వంటి షో అసలు మన తెలుగులో క్లిక్ అవుతోందా? అనే విమర్శలు వినిపించాయి. అలాంటిది యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోష్ ఫుల్ హోస్టింగ్ తో ఈ షో తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ సీజన్ ను నేచురల్ స్టార్ నాని తన నేచురల్ హోస్టింగ్ తో ఆద్యంతం రక్తి కట్టించాడు. ఇక మూడో సీజన్ మొదలుకొని ఇప్పటి ఏడో సీజన్ వరకూ కింగ్ నాగార్జున తనదైన వ్యాఖ్యానంతో తెలుగులో బిగ్ బాస్ షో కి వన్నె తెచ్చాడనే చెప్పొచ్చు.

బిగ్ బాస్ షో.. అందులో పార్టిసిపెంట్స్.. విన్నర్స్ కి వస్తోన్న పబ్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బిగ్ బాస్ షో కి ఎంతటి పాజిటివిటీ వస్తుందో.. దానికి మించి అన్న రీతిలో నెగటివిటీని కూడా మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వహకుల గురించి వస్తోన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అని.. తమకు కావాల్సిన వాళ్లకే షో లో ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు మొదటి నుంచి ఉన్నావే.

ఇటీవలే బిగ్ బాస్ షో నుంచి బయటకొచ్చిన దామిని అయితే బిగ్ బాస్ నిర్వహకులపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది. తాను వెజిటీరియన్ అయినా బిగ్ బాస్ షో లో చికెన్ కూర వండానని.. అది చూపించలేదని.. అలాగే ఓ టాస్క్ లో ప్రిన్స్ యావర్ ముఖాన పేడ కొట్టానని.. అయితే టాస్క్ పూర్తవ్వగానే సారీ చెప్పి తనకు తలంటు పోశానని.. అది కూడా చూపించలేదని నిర్వహకులపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది. వినాయకచవితి సందర్భంలో ప్రిన్స్ యావర్ ప్రసాదం తీసుకుంటే తాను మెచ్చుకున్న విజువల్స్ కూడా చూపించలేదు. పైగా.. సందీప్ మాస్టర్ తో యావర్ వయలెంట్ గా ఉంటాడు కానీ కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. మొన్న వినాయకచవితికి అక్షింతలు వేశాడు అంటే.. ఆ పదాలు అన్నీ లేపేసి యావర్ అక్షింతలు వేశాడు అనేదే చూపించారు అని దామిని నిర్వహకులపై తన అసహనాన్ని వ్యక్త పరిచింది.

అయితే బిగ్ బాస్ నిర్వహకులు ఒక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి.. తమ వర్గం వారికే షో లో ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గతంలో కూడా సోహెల్, మెహబూబ్, శ్రీహాన్ షేక్ విషయాల్లో వారు అలాగే వ్యవహరించారని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.. వాళ్లంతా అసలు ప్రైజ్ మనీ గెలవకపోయినా.. వారికి అమౌంట్ వచ్చేటట్టు చేయడంలో బిగ్ బాస్ నిర్వహకులు ప్రధాన పాత్ర పోషించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ వంటి ప్రేక్షకాదరణ పొందిన షో విషయంలో ఒక వర్గానికే కొమ్ము కాయడం ఏమాత్రం మంచిది కాదంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts