‘సలార్’ ట్రిపుల్ ధమాకా! ఫ్యాన్స్ కు పూనకాలే

సూపర్ హిట్టైన సినిమాల క్రేజ్ ను సూపర్ లెవెల్ లో వాడుకోవడానికే సీక్వెల్ ట్రెండ్ ను మొదలుపెట్టారు ఫిల్మ్ మేకర్స్. అలాగే ఈ మధ్య సీక్వెల్స్ తో పాటు ఒకటవ పార్ట్, రెండవ పార్ట్ అంటూ ఒకే కథని రెండు భాగాలుగా చూపించే సరికొత్త ఒరవడీ మొదలైంది. వీటితో పాటు లేటెస్ట్ గా కొంతమంది డైరెక్టర్స్ తమ సినిమాలకోసం ఓ సినిమాటిక్ యూనివర్శ్ నే సృష్టిస్తున్నారు.

ఈ లిస్టులో లోకేష్ కనకరాజ్, శైలేష్ కొలను వంటి యంగ్ డైరెక్టర్స్ ముందున్నారు. అయితే రేంజ్ లో వీళ్లిద్దరికంటే పెద్దవాడైన ప్రశాంత్ నీల్ అసలు సిసలు సినిమాటిక్ యూనివర్శ్ ను క్రియేట్ చేస్తున్నాడట. ‘కె.జి.యఫ్‘ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ‘సలార్‘ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ‘సలార్‘ కూడా రెండు భాగాలునే రెడీ అవుతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా లైన్లో ఉంది. ‘కె.జి.యఫ్3‘ కూడా పైప్ లైన్లో ఉంది.

అయితే ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న ‘సలార్‘.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలకి కూడా ‘కె.జి.యఫ్‘ కథాంశంతో లింక్ ఉంటుందట. ఈ సినిమాల కథాంశాలన్నీ ఒకదానితో మరొకటి సంబంధం ఉండేటట్టు తీర్చిదిద్ది తన సినిమాటిక్ యూనివర్శ్ ని సృష్టిస్తున్నాడట ప్రశాంత్ నీల్. ‘

ఈనేపథ్యంలోనే ‘సలార్‘లో ఎన్టీఆర్, యష్ లు అతిథి పాత్రల్లో మెరవబోతున్నారనే న్యూస్ ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఒకవేళ అదేగానీ నిజమైతే ప్రభాస్, ఎన్టీఆర్, యష్ లను ఒకే ఫ్రేమ్ లో చూడడానికి రెండు కళ్లు చాలవు.

Related Posts