ఓజి నుంచి ఇమ్రాన్‌ ఫస్ట్‌లుక్‌

పవన్ ఫ్యాన్స్ కు సూపర్ అప్‌డేట్ ఇచ్చాడు ఇమ్రాన్‌ హష్మి. బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మి.. పవర్‌స్టార్‌ ఓజి తో సౌత్ ఎంట్రీ ఇస్తున్నాడు. మర్డర్, జన్నత్, ఆషిక్ బనాయా ఆప్నే వంటి హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హష్మీ, తెలుగులో కళ్యాణ్ సరసన విలన్‌గా నటిస్తున్నాడు. ఓజి చిత్రం నుంచి ఇమ్రాన్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. నుదిటి మీద కోతతో సిగరెట్ వెలిగిస్తున్న ఇమ్రాన్ పోస్టర్‌ వైరల్ అవుతోంది. ఈ లుక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసాడు ఇమ్రాన్‌ హష్మి.

Related Posts