‘సలార్‘ బిజినెస్ లెక్కలు ఇవిగో!

పాన్ ఇండియా లెవెల్ లో ‘సలార్‘ సందడి మొదలయ్యింది. మరో పాతిక రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ బిజినెస్ లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్‘ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఓ రేంజులో ఉందనేది ఆ లెక్కల్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రలో రూ.85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. సీడెడ్ లో రూ. 27 కోట్లు రాబట్టాల్సి ఉంది. అలా.. ఆంధ్ర, సీడెడ్ రెండు ప్రధాన ఏరియాలలో దాదాపు రూ.112 కోట్లు వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

లేటెస్ట్ గా ‘సలార్‘ నైజాం లెక్కలు కూడా బయటకు వచ్చాయి. నైజాంలో ఏకంగా రూ.90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఇందులో రూ.25 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ ఉందట. అంటే.. నైజాంలో ‘సలార్‘ రూ.65 కోట్లు షేర్ సాధిస్తే.. డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్‘ దాదాపు రూ.200 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందన్నమాట. మరోవైపు.. అమెరికాలోనూ ‘సలార్‘ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందట. యు.ఎస్. లో ఈ చిత్రం రూ. 36 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో ‘సలార్‘ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోందట.

కన్నడలో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓన్ రిలీజ్ చేస్తుండగా.. కేరళలో పృథ్వీరాజ్ తన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ కి చెందిన రెడ్ జయంట్ మూవీస్, హిందీలో ఎ.ఎ. ఫిల్మ్స్ ‘సలార్‘ని రిలీజ్ చేస్తున్నాయి. ఓవరాల్ గా థియేట్రికల్ పరంగానే ‘సలార్‘ దాదాపు రూ.450 కోట్లు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. ‘సలార్‘ నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ మొత్తానికే వెళుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

Related Posts