గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా ప్రారంభం

మేచో స్టార్ గోపీచంద్ ఒక్క బ్లాక్ బస్టర్ కోసం చాలా కాలంగా స్ట్రగుల్ అవుతున్నాడు. కానీ అతను కథలు మార్చడం లేదు. కేవలం తన ఇమేజ్ చుట్టూ అల్లుకున్న కథలకే ఓటేస్తున్నాడు. అతను ఫెయిల్ అవుతుండటానికి ఇదీ ఓ కారణం. ఈ విషయంలో మేల్కోకపోతే రిజల్ట్ రిపీట్ అవుతుంది తప్ప అతను కోరుకున్న విజయం రాదు. చివరగా వచ్చిన పక్కా కమర్షియల్, రామబాణం చూస్తే కథల ఎంపికలో అతను ఎంత వీక్ గా ఉన్నాడో అర్థం అవుతుంది. గతం గతం.. ఇప్పుడైనా మారాడు అనేలా కనిపిస్తున్నాడు. అందుకు కారణం భీమా. కన్నడ దర్శకుడు ఏ హర్ష రూపొందిస్తోన్న సినిమా ఇది.. భీమా. ఈ మూవీ ఫస్ట్ టైటిల్ తో పాటు లుక్ నుంచి ఓ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. గోపీచంద్ ను ఇలా చూడాలనే ప్రేక్షకులు అనుకుంటారు. కానీ బలమైన కంటెంట్ తో అలా కనిపించాలి. ఈ మూవీ గురించి టాలీవుడ్ లో కూడా పాజిటివ్ గా వినిపిస్తుంది. దర్శకుడు హర్ష మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో ఎక్స్ పర్ట్.

ఇక ఈ మూవీ తర్వాత కొన్నాళ్లుగా వినిపిస్తోన్న శ్రీను వైట్ల సినిమా ప్రారంభం అయింది.గోపీచంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా అన్న వార్తలు వచ్చినప్పుడే చాలామంది సెటైర్స్ వేశారు. ఇద్దరూ డిజాస్టర్స్ లో ఉన్నారు. ఇప్పుడు అవసరమా అన్నారు. ముఖ్యంగా శ్రీను వైట్లలో స్టఫ్‌ అయిపోయింది .. గోపీచంద్ కు మరో ఫ్లాప్ గ్యారెంటీ అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. బట్ బాగా కసిలో ఉన్న ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇలాంటి కామెంట్లు, సెటైర్స్ కు గట్టి సమాధానమే చెబుతారు అనుకోవచ్చు.


2018లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత శ్రీను వైట్లకు మరో సినిమా పడలేదు. ఈ లోగా కరోనా కూడా రావడం వల్ల మరింత గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్ లో చాలామందికి కథలు చెప్పాడు కూడా. బట్ ఎవరూ అతని ట్రాక్ చూసి ఛాన్స్ ఇవ్వేలేదు.

ట్రాక్ అంటే 2013 తర్వాత శ్రీనుకు హిట్ లేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ తర్వాత ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి ఫ్లాపులు పడ్డాయి. ఏదేమైనా ఇప్పటికీ ఈ కాంబినేషన్ మీద కమెంట్స్ ఉన్నాయి. ఆ కమెంట్స్ కు ఓ బిగ్ బ్లాక్ బస్టర్ తో సమాధానం చెబుతారేమో చూడాలి.

Related Posts