HomeMoviesటాలీవుడ్NBK109 హీరోయిన్ పై కొనసాగుతూనే ఉన్న సస్పెన్స్

NBK109 హీరోయిన్ పై కొనసాగుతూనే ఉన్న సస్పెన్స్

-

టాలీవుడ్ లో విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు నటసింహం బాలకృష్ణ. మరే సీనియర్ హీరో లేనంతగా ఇప్పుడు బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఊపులో అప్ కమింగ్ మూవీ NBK109తో మరో భారీ విజయాన్ని దక్కించుకునేందుకు రెడీ అవుతున్నాడు.

బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న బాలకృష్ణ 109వ సినిమా నుంచి ఇటీవల రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. ‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్‘ అంటూ తనదైన పవర్ ఫుల్ డైలాగ్స్ తో గ్లింప్స్ లో చెలరేగిపోయాడు బాలయ్య. ఒకవైపు సైలెంట్ గా చిత్రీకరణ పూర్తిచేసుకుంటోన్న ఈ సినిమా టైటిల్ పైనా, విడుదల తేదీ పైనా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అలాగే.. ఈ చిత్రంలో కనిపించబోయే చాలామంది నటీనటుల గురించి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ఈ మూవీలో విలన్ గా కనిపించబోతుండగా.. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో కీ రోల్ లో కనువిందు చేయబోతున్నాడు. ఇంకా.. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి, గౌతమ్ మీనన్, ‘దసరా‘ ఫేమ్ షైన్ టామ్ చాకో వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేదే ఇప్పటికే మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మిగిలింది. త్వరలోనే బాలయ్య 109 టైటిల్ తో పాటు.. హీరోయిన్ ఎవరనే దానిపైనా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

ఇవీ చదవండి

English News