రాజమౌళి, మహేష్‌ వచ్చినా.. సౌండ్ లేదే

ఇవాళా రేపు స్టార్ హీరోల చేతుల మీదుగా ట్రైలర్, టీజర్, సాంగ్స్ ను విడుదల చేయించడం కామన్ అయింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు పెద్దవాళ్లు రిలీజ్ చేస్తే కొంత బజ్ వస్తుంది. ఎక్కువమంది ప్రేక్షకులకు తెలుస్తుంది. అయితే ప్యాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు కలిసి విడుదల చేసినా .. ఒక సినిమా ట్రైలర్ కుఅసలు బజ్ రాలేదు.

ఆ రేంజ్ సౌండ్ కూడా వినిపించడం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసు కదా.. నాయకుడు. తమిళ్ లో రీసెంట్ గా వచ్చిన మామన్నన్ అనే చిత్రాన్ని తెలుగులో నాయకుడు పేరుతో డబ్ చేస్తున్నారు. ఈ నెల 14న విడుదల కాబోతోన్న ఈమూవీ ట్రైలర్ నే రాజమౌళి, మహేష్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. బట్ వారి స్థాయికి తగ్గ సౌండ్ ఈ ట్రైలర్ కు వినిపించడం లేదు.


నాలుగు దశాబ్ధాలుగా తమిళనాట టాప్ కమెడియన్ గా ఉన్న వడివేలు మొదటి సారిగా ఓ సీరియస్ పాత్ర చేసిన సినిమా ఇది. సినిమా అంతా అతని కేంద్రంగానే సాగుతుంది. ఫహాద్ ఫాజిల్ విలన్. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్‌ పెయిర్ గా నటించారు. కుల వివక్షత, అణచివేతల నేపథ్యంలో పొలిటికల్ డ్రామాను మిక్స్ చేసి మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

తమిళ నాట విపరీతమైన ప్రశంసలు అందుకుంది. ఎంతోమంది టాప్ సెలబ్రిటీస్ ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. చిత్ర టీమ్ ను సత్కరించారు. బట్ తెలుగుకు వస్తున్నప్పుడు మాత్రం అసలు ఆ క్రేజ్ ఏం కనిపించడం లేదు. మరి అందుకు కారణాలేంటనేది సులువుగానే ఊహించొచ్చు. ఇలాంటి రియలిస్టిక్ కథలకు తెలుగులో పెద్దగా ఆదరణ ఉండదు. పైగా డిస్క్రిమినేషన్ నేపథ్య అంటే అసలు ఉండదు. అందుకే నాయకుడుకు పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు అనుకోవచ్చు.

Related Posts