గాండీవధారి అర్జున టీజర్ ఎలా ఉంది

వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రూపొందిన సినిమా గాండీవధారి అర్జున. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ విడుదలైంది. గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ ను చూసినప్పుడే ఇది పూర్తిగా ప్రవీణ్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపించింది. ఇప్పుడు అదే మరో కోణంలో కనిపిస్తోంది.

ఈ మూవీలో వరుణ్ ఓ ఏజెంట్ గా నటిస్తున్నాడని ముందే చెప్పారు. అతనితో పాటు హీరోయిన్ కూడా ఏజెంట్ గానే కనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి మన దేశానికి రాబోతోన్న ఓ పెద్ద ముప్పును ఆపడంతోపాటు దాని ముసుగులో సాగుతున్న లక్షల కోట్ల వ్యాపారం గుట్టును బయటపెట్టబోతున్నారని ఈ టీజర్ చూస్తే అర్థం అవుతుంది.


టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఓ మంచి ఎంటర్టైనర్ ను చూడబోతున్నాం అనే నమ్మకాన్ని ఇస్తోంది. ఈ తరహా సినిమాలు ఎన్ని వచ్చినా.. స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉంటే ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఇక ప్రవీణ్ సత్తారు ఇలాంటి స్టోరీస్ ను ఎలా డీల్ చేస్తాడో గరుడవేగతో ప్రూవ్ అయింది. అతని గత సినిమా ఘోస్ట్ నిరాశపరిచినా.. మేకింగ్ పరంగా మెస్మరైజ్ చేశాడు.

ఇక ఈ గాండీవధారి మేకింగ్ తో పాటు కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా ఉందని అర్థం అవుతుంది. ఎక్కువగా విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించినట్టుగానూ కనిపిస్తోంది. ఈ మూవీతో వరుణ్ తేజ్ ఇప్పటి వరకూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. అతని లుక్ బావుంది. ఫిట్ గా ఉన్నాడు.

టీజర్ లోనే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హీరోయిన్ సాక్షి వైద్యకు ఇది సెకండ్ మూవీ. విశేషం ఏంటంటే.. తన ఫస్ట్ మూవీ ఏజెంట్. అందులోనూ హీరో స్పై. ఇందులోనూ స్పై. కాకపోతే ఈ సారి తను కూడా ఏజెంట్ గా మారింది. మొత్తంగా ఆగస్ట్ 25న విడుదల కాబోతోన్న గాండీవధారిపై ఈ టీజర్ మంచి అంచనాలే క్రియేట్ చేసిందని చెప్పాలి.

Related Posts