దిల్ రాజు కొత్త మల్టీప్లెక్స్

ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారాడు దిల్ రాజు. నిర్మాత అయిన తర్వాత కూడా ఆ రెండు విషయాలు వదల్లేదు. టాప్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్ రంగంలో తిరుగులేని పట్టు సాధించుకున్నాడు. ఎగ్జిబిటర్ కూడా రాష్ట్రవ్యాప్తంగా అతని చేతిలో ఎన్నో థియేటర్స్ ఉన్నాయి.

అయితే సొంతంగా దిల్ రాజు నిర్మించుకున్న థియేటర్స్ లెక్కలు కూడా చాలానే ఉన్నాయి. ఇక తాజాగా గద్వాల్ జిల్లా కేంద్రంలో ఓ కొత్త థియేటర్స్ ను ప్రారంభించబోతున్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ను షార్ట్ ఫామ్ గా మార్చి “ఎస్.వి.సి.” అనే తమ బ్యానర్ పేరునే ఈ థియేటర్స్ కు పెట్టాడు. అంటే ఎస్వీసీ థియేటర్ అని జనాలు పిలుచుకుంటారన్నమాట. అత్యంత అధునాతమైన సౌకర్యాలు ఈ థియేటర్స్ లో ఉంటాయట.

మొత్తం మూడు స్క్రీన్స్ ఉంటాయి. ఈ మూడింటికి కలిపి 979 సీటింగ్ కెపాసిటీ ఉంది. అన్ని స్క్రీన్స్ లో రిక్లైనర్ సీట్స్ కూడా ఉన్నాయి. సింపుల్ గా ఓ చిన్నపాటి మల్టీప్లెక్స్ థియేటర్ అన్నమాట.


ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నప్పుడు గద్వాల సాధారణ పట్టణంగానే ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాగా మార్చారు. అందుకే ఈ జిల్లా కేంద్రలోనే మల్టీప్లెక్స్ నిర్మించాడు దిల్ రాజు.

Related Posts