కంగనను లైట్ తీసుకున్నారా లేక..

కాంట్రవర్శీలు పక్కన బెడితే నటిగా కంగనా రనౌత్ ప్రతిభను ఎప్పుడూ తక్కువ చేయలేం. కొన్ని పాత్రలు తను చేయడం వల్లే పెద్ద విజయం సాధించాయి అంటే అతిశయోక్తి కాదు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ గానూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ లాంటి నటిని తీసుకున్నప్పుడు తనకు ప్రాధాన్యం ఇస్తేనే సినిమాకు ఉపయోగం. కానీ చంద్రముఖి2 విషయంలో ఆమెకు బాగా అన్యాయం జరిగినట్టుగా కనిపిస్తోంది. సినిమాలో కొన్నిసార్లు కంటెంట్ కోసం దాచారు అనే మాట వినిపిస్తుంది. కానీ ఇక్కడ దాపరికాలు కూడా ఏం లేవు.

చంద్రముఖి ఎవరు అనేది ఆల్రెడీ పోస్టర్స్ తో పాటు ఆ మధ్య వచ్చిన ఒక పాట ద్వారా తేలిపోయింది. అయినా ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్ లో కానీ.. లేటెస్ట్ గా వచ్చిన కొత్త ట్రైలర్ లో కనాఈ ఆమెకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కొత్త ట్రైలర్ చివర్లో మాత్రం లారెన్స్ తో కత్తి యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది. అది కూడా క్లోజప్ షాట్స్ లో పడలేదు. దీంతో కావాలనే కంగనాను దాస్తున్నారా లేక నిజంగానే ఆమె పాత్రను వాడుకోవడం లేదా అనే డౌట్ అందరిలోనూ వినిపిస్తోంది.


ఇక ఫస్ట్ ట్రైలర్ లో అస్సలే మాత్రం కొత్తదనం లేదు అనేది అందరికీ తెలుసు. అది సీక్వెల్ ట్రైలర్ లా కాక చంద్రముఖి ట్రైలర్ లానే అనిపించింది. జస్ట్ హీరో మారాడంతే. ఇక కొత్త ట్రైలర్ సైతం అలానే ఉంది. ఏ మాత్రం కొత్తదనం లేదు. సినిమా అంతా సులువుగానే ఊహించొచ్చు అనేలా ఉంది. ప్రతి షాట్ లోనూ కథ కనిపిస్తోంది. చంద్రముఖిలో ఉన్నది ఒరిజినల్ కాదు అని అసలు చంద్రముఖి ఈ చిత్రంలోనే ఉంటుందన్నట్టుగా కొత్త డైలాగ్ ఉంది. అలాగే వేంకటపతి రాయలు కూడా వచ్చాడు అంటున్నారు. అంటే అతనూ ఆత్మలా మారాడా అంటే అవును అని చిన్న పిల్లలను అడిగినా చెప్పేలా ఉంది.

మొత్తంగా చంద్రముఖి2పై ఇప్పటికైతే ఆశించిన బజ్ లేదు. అటు కంగనాపాత్రను దాయడం వల్ల ఉపయోగం కూడా లేదు అనేలా ఉంది. ఏదైనా అద్భుతం జరిగి.. అస్సలెవరూ ఊహించిన ట్విస్ట్ లు ఉంటే తప్ప ఇది వర్కవుట్ కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనేలా ఈ రెండు ట్రైలర్స్ ఉన్నాయి.

Related Posts