డిసెంబర్ 1 నుంచి ‘ధూత‘ వెబ్ సిరీస్

నాగచైతన్య మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ ‘ధూత‘. ఇప్పటికే అక్కినేని హీరోలకు ‘మనం‘ వంటి మెమరబుల్ మూవీ అందించిన విక్రమ్ కుమార్ ఈ సిరీస్ ను తెరకెక్కించాడు. చాలాకాలం క్రితమే మొదలైన ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తోందా? అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. లేటెస్ట్ గా నాగచైతన్య ‘ధూత‘ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘ధూత‘ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ లో 40 నిమిషాల చొప్పున 8 ఎపిసోడ్స్ ఉంటాయట. ఈ సిరీస్ లో నాగచైతన్యతో పాటు పార్వతి తిరువోత్తు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Related Posts