అండర్ వాటర్ లో ‘దేవర‘ బీభత్సం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. భారీ పాన్ ఇండియా మూవీ అవడం వల్ల ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ లో సినిమా రావడం కష్టమనే వార్తలు ఆమధ్య ఎక్కువగా వినిపించాయి. కానీ ‘దేవర‘ షూటింగ్ స్పీడు చూస్తుంటే మేకర్స్ పక్కా ప్లానింగ్ వెళుతున్నారనిపిస్తుంది. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ‘దేవర‘ లేటెస్ట్ గా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసిందట.

ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సముద్రం నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే హైలైట్ అవుతాయని ముందు నుంచి చెబుతోంది చిత్ర బృందం. తాజాగా నైట్ ఎఫెక్ట్ లో మిడ్ సీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ హ్యూజ్ యాక్షన్ సీక్వెన్స్ ను కంప్లీట్ చేసినట్టు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో తెలిపాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. అందుకు సంబంధించిన ఓ స్టిల్ ను కూడా పోస్ట్ చేశాడు.

సినిమాలో చాలా కీలకంగా సాగే ఈ అండర్ వాటర్ సీక్వెన్సెస్ కోసం తారక్‌ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడట. ఇప్పటివరకూ ఎన్టీఆర్ చేయనటువంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘దేవర‘ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడట కొరటాల శివ. అనిరుధ్, రత్నవేలు, సాబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కనిపించబోతున్నాడు. మొత్తంమీద వచ్చే యేడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘దేవర‘ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Posts