బ్లాక్ బస్టర్ ట్రైలర్ జవాన్ ..

షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకోణ్, ప్రియమణి, యోగిబాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా జవాన్. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన సినిమా ఇది. సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది.

ఇప్పటి వరకూ ప్రమోషన్స్ పరంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. బట్ రీసెంట్ గా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ తో పాటు విడుదల చేసిన జవాన్ ట్రైలర్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. విజువల్ గ్రాండీయర్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లతో హోరెత్తిపోవడం ఖాయం అనేలా ఉందీ ట్రైలర్. ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ కే అద్భుతమైన రెస్పాన్‌స్ వచ్చింది. ఈ ట్రైలర్ దాన్ని మించి అనేలా ఉండటం విశేషం. ఇక ఈ ట్రైలర్ చూస్తే షారుఖ్ ఖాన్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. తన తండ్రికి ఎదురైన విలన్ నే తనూ ఎదుర్కోవాల్సి వస్తుందనేలా ఉంది.


ఆ విలన్ గా విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు. విజయ్ సేతుపతి కూడా మిడిల్ ఏజ్డ్ పర్సన్ నుంచి ఓల్డేజ్ పర్సన్ లా డిఫరెంట్ గెటప్స్ లో ఉన్నాడు. అటు షారుఖ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్నాడు. అంటే తండ్రిని చంపేసిన వ్యక్తి మీద పగ తీర్చుకునే పాత్రలో మరో షారుఖ్ కనిపిస్తాడు అనిపిస్తోంది.

అలాగే తండ్రి పాత్రకు జోడీగా దీపికా పదుకోణ్ ఉందా అనిపిస్తోంది. నయనతార అప్పీరియన్స్, రోల్.. మాస్ అండ్ క్లాస్ ను మెప్పించేలా కనిపిస్తున్నాయి. ” మేము జవాన్లం.. మా ప్రాణాలు ఒక్కసారి కాదు వెయ్యిసార్లు అయినా పోగొట్టుకుంటాం.. అదీ ఈ దేశం కోసమే. కానీ మీలాంటి వాళ్లు.. దేశాన్ని అమ్ముకుంటూ పోతూ ఉంటే మీ లాభాల కోసం మా ప్రాణాలు త్యాగం చేయలేం.. నో డీల్.. ” అంట షారుఖ్ చెప్పిన డైలాగ్ చూస్తే ఈ సినిమాలో బలమైన కంటెంట్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా ట్రైలర్ తో సినిమాకు బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చాయని మాత్రం చెప్పాలి. ఈ రేంజ్ లోనే సినిమా కూడా ఉంటే ఇక పఠాన్ రికార్డులు బద్ధలైపోవడం ఖాయం.

Related Posts